PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో.. సేవ్ జర్నలిజం డే”

1 min read

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలి

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:  మండల కేంద్రమైన గాంధీ జయంతి సందర్భంగా  కౌతాళం  ఏపీయుడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా “సేవ్ జర్నలిజం డే” ను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు ఇచ్చినందుకు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ కౌతాళం మండల అధ్యక్షులు విజయ్, సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరియు గత నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదుదాదాపు పన్నెండు వేలమంది అర్హులైన జర్నలిస్టులు అక్రెడిటేషన్ పొందలేక పోయారు! హెల్త్ కార్డుల పరిస్తితి కూడా అధ్వాన్నంగా తయారైంది.ప్రమాదబీమా పథకం పూర్తిగా అటకెక్కింది. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరు కోసం ప్రత్యేక పథకం తీసుకు వస్తానని ముఖ్యమంత్రి మన యూనియన్ కు ఇచ్చిన హామీ ఒక్కఅంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు!జర్నలిస్టులపై పలు జిల్లాల్లో దాడులు జరిగాయి పైగా జర్నలిస్టులపై అక్రమకేసులు  బనాయించారుని జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేకచట్టం చేయాలని , గతఏడాది కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించాలని , జర్నలిస్టులకు రైల్వేలో గతంలో ఉన్న ప్రయాణరాయితీని పునరుద్ధరించాలని కౌతాళం మండలం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజె) యూనియన్ సభ్యులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏపియూడబ్ల్యూజే యూనియన్ మండల అధ్యక్షులు విజయ్ మరియు తాలూకా సహాయ కార్యదర్శి ఆరిఫ్ మండల ఉపాధ్యక్షులు అంజి,సాదిక్,నరేష్ మరియు మండల సహాయ కార్యదర్శి శివకుమార్,,యూనియన్ సభ్యులు అనిల్ కుమార్,రాముడు,రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

About Author