తారు రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి.. బీఎస్పీ పార్టీ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: జలకనూరు గని గ్రామాల మధ్యలో నున్న తారు రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని మంగళవారం నాడు బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూర్ అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని జలకనూరు గని గ్రామాల మీదుగా నందికొట్కూరు నుండి మంచాలకట్ట గని బ్రాహ్మణ పల్లె శకునాల గ్రామాలకు వందలు వేల సంఖ్యలో టూ వీలర్స్ టిప్పర్లు తిరుగుతుంటాయని అయితే రోడ్డు మోకాళ్ళ లోతు గుత్తులు పడి ప్రయాణికులకు ప్రమాదాలు చోటు చేసుకుంటన్నాయని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్రంలో ఒక గుంత లేకుండా చేస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఎటు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తొందరలో రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడకపోతే జలకనూరు గని మంచాలకట్ట గ్రామ ప్రజలను ఏకం చేసి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.