శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టును కాపాడండి..
1 min read– విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ రోజు ఉదయం 11:30 గం.లకు శ్రీ లక్ష్మీ జగన్నాథ గుట్టును పరిరక్షించాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందించిన అనంతరం వారు మాట్లాడుతూ…. కర్నూలు జిల్లా లో ఏడుకొండలపై శ్రీ లక్ష్మీ జగన్నాథస్వామి వారలు కొలువైఉన్నారనీ ఆ పరమ పవిత్రమైన 7 కొండలు కర్నూలు నగరానికి అతి దగ్గరగా కర్నూలు – బెంగళూరు హైవే నెం: 44 ప్రక్కన సహజసిద్ధంగా ఏర్పడ్డాయి….గత 11(2012) సం.ల క్రితం సంగమేశ్వరం లో ముంపుకు గురైన అద్భుతమైన కళా స్వరూపాలకు నెలవైన,అతిపురాతనమైన రథం ఆకారంలో ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి శివాలయాన్ని అప్పటి కలెక్టర్ శ్రీ సాయిప్రసాద్ గారి చొరవతో ప్రతి ష్టించబడినది,ఇప్పుడు గౌరవనీయులైన కలెక్టర్ గారు ఛైర్మెన్ గా,గౌరవ అధ్యక్షులుగా గుణంపల్లి రాఘవరెడ్డిగారిని నియమించి రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ ద్వారా ఆ ఆలయ నిర్వహణ జరుగుతోంది, అలాగే అప్పటి విశ్వహిందూపరిషత్ రాష్ట్ర కోశాధికారి,మహాదాత కీ.శే. గౌ.శ్రీ పుల్లారెడ్డి గారు,ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త కే.జే.రెడ్డి గారు, మాజీ ఎం.పీ. గౌరవనీయులు టీ.జీ. వెంకటేష్ వంటి దాతల దాతృత్వం తో 63 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ,రామాలయాన్ని,ధ్యానమందిరాన్ని, వినాయక స్వామి ఆలయాన్ని,35 అడుగుల భారీ నంది విగ్రహాం వంటివి ఇప్పటికే పూర్తయ్యాయనీ, అష్టలక్ష్మీ ఆలయం నిర్మాణం కూడా జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ అన్నారు,జిల్లా కార్యదర్శి మాళిగి భాను ప్రకాష్ మాట్లాడుతూ..రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం 50 ఎకరాలు ఇవ్వాలని గతంలో అధికారికంగా నిర్ణయించినా ఇప్పటివరకూ సదరు భూమిని ఆలయానికి స్వాధీన పరచలేదు,అంతేకాదు శ్రీ లక్ష్మీ జగన్నాథ స్వామి కొలువై ఉన్న కొండ,దాని అనుబంధంగా ఉన్న ఇతర కొండలపై సరైన నిర్వహణ లేక, దేవాదాయ శాఖ,అటవీశాఖ వారి నిర్లక్ష్యం కారణంగా అన్యమతస్తులు విచ్చలవిడిగా కొండలను ఆక్రమించి తమ తమ ఆలయాలనూ,చిహ్నాలనూ (దర్గా,శిలువ,చర్చి వంటివి) స్థాపించి విచ్చలవిడిగా జగన్నాథుని కొండలను నాశనం చేస్తున్నారు .అంతే కాక ప్రస్తుత ప్రభుత్వం నడిపే పార్టీకి చెందిన కార్యకర్తలు శ్రీ లక్ష్మీ జగన్నాథుని కొండలను విచ్చల విడిగా అక్రమ మైనింగ్ చేస్తూ…కొండలను పగులగొట్టి మట్టిని యధేచ్ఛగా దోచుకుంటుంటే అడిగే నాథుడే లేడు ఇలా నిరంతరం రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట హిందూ దేవాలయాలపై దాడులూ,వాటి ఆస్తులు ఆక్రమణలకు గురౌతూనే ఉన్నాయి,అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు ఆలయం చేరింది,అసాంఘిక శక్తులు చేరి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. కాబట్టి విశ్వహిందూ పరిషత్ దీనిని తీవ్రమైన విషయంగా పరిగణిస్తుందనీ, దేవాదాయ, అటవీ,మైనింగ్,పోలీసు శాఖల అధికారులతో వెంటనే ప్రత్యేక సమావేశం నిర్వహించి,శ్రీ లక్ష్మీ జగన్నాథునికి సంబంధించిన ఏడుకొండలనూ యుద్ధప్రాతిపదికన పరిరక్షించాలనీ,అన్యమతస్తుల అక్రమ కట్టడాలను సదరు కొండలపై నుండి వెంటనే తొలగించాలనీ,అక్రమ మైనింగ్ మాఫియా నుండి జగన్నాథ స్వామి వారి కొండలను రక్షించాలనీ ఈ విషయంలో కర్నూలు జిల్లా పోలీసు అధికారిని కూడా కలిసి వినతి పత్రం అందించి చర్యలు చేపట్టామని కోరతామనీ,కేంద్రం గృహమంత్రి వర్యులు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళతామనీ… లేని ఎడల విశ్వహిందూపరిషత్ ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేసి ఛలో జగన్నాథ గట్టు కు పిలునిస్తామని హెఛ్ఛరించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కోశాధికారి శ్రీనివాస రెడ్డి,నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు పాల్గొన్నారు.