దర్గా స్థలాన్ని కాపాడండి
1 min readపల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి : మండలం లోని పెద్దవంగలి అతి మహిమానిత్వమైన దస్తగిరి స్వామీ దర్గా అన్నదాన సత్రంకు చెందిన కొందరు ఆక్రమంగా రిజిష్ట్రర్ చేయించుకున్నారని ఆ స్థలాన్ని కాపాడాలని దర్గా కమిటీ అధ్యక్షులు ముల్లా మహబూబ్పీరా,కార్యదర్శి గౌస్పీరా కోరారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ దర్గా కు ఇతరులు దానం చేసిన స్థలంలో 2017 లో అందరి సహకారంతో అన్నదాన సత్రాన్ని నిర్మించామని దానిని కొందరు వారసులమని అధికారులతో కుమ్మక్కై గ్రామ పరధిలోని 233/10 సర్వే నెంబరులో 5సెంట్లు ఉండగా 8 సెంట్ల స్థలాన్ని తమ పేరు మీద సత్రం స్థలాన్ని రిజిష్ట్రర్ చేయించుకున్నారన్నారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఆర్ఐ విజయలక్ష్మి కి వినతి పత్రాన్ని అందజేసారు. కార్యక్రమం లో కమిటి సభ్యులు రబ్బానీ,మహబూబ్బాష,మహబూబ్పీరా,మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.