పర్యావరణాన్ని పరిరక్షించండి, జ్యూట్ బ్యాగ్స్,జ్యూట్ ఉత్పత్తులు వినియోగించండి
1 min read
సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్:తాతపూడి ఇమ్మానుయేలు
ప్రతిమహిళ ఆర్థికంగా, రాజకీయంగా,సామాజికంగా ఎదగాలి
వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పెరికె.వరప్రసాదరావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పర్యావరణాన్ని కాపాడాలని,జ్యూట్ ఉత్పత్తులను వినియోగించాలని సోషల్ సర్వీస్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్:తాతపూడి ఇమ్మానియేల్ జిల్లా ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ మహిళలకు పిలుపునిచ్చారు. సెయింట్ జాన్ వల్పేర్ సొసైటీ ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్స్, డిస్ప్లేని మంగళవారం ఉదయం స్థానిక ఇశ్రాయేల పేటలో ఫాదర్ టి ఇమ్మానుయేల్ ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వల్ల 21 రకాల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని జూట్ పేపర్, క్లాత్ బ్యాగ్స్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోన్ సెంటర్ ప్రైజెస్ ఎండి పెరికె. దీనగ్లాడి మాట్లాడుతూ కుటుంబం ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలంటే ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. సెయింట్ జోన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పెరికె.వర ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని హితవు పలికారు. మహిళలు అందుబాటులో ఉన్న బ్యాంకు రుణాలు తీసుకొని చిన్న చిన్న యూనిట్లు స్థాపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫాదర్ ఇమ్మానియేల్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు పాతపూడి బాలస్వామి, మరియు కృపానందం, డోక్రా మహిళలు, సోషల్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొని జ్యూట్ బ్యాగ్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పెరికె.వర ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.