రాష్ట్రాన్ని రక్షించండి ! దేశాన్ని కాపాడండి !!
1 min read– సిపిఐ ప్రచార జాతా-బస్సు యాత్ర ఆగస్టు 17న విశాఖపట్నం నుండి తిరుపతిలో సెప్టెంబర్ 8వ తేదీన భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
– హోళగుంద మండల కేంద్రంలో స్థానిక LLC గెస్ట్ హౌస్ నందు ఆలూరులో సెప్టెంబర్ 02వ తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక పాతబస్టాండ్ నందు భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి అంటూ గోడపత్రికలను విడుదల చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి.గిడ్డయ్య
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి.గిడ్డయ్య మాట్లాడుతూ_* _కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం త్రాగునీటి సైతం తుంగభద్ర దిగువ కాలువ మీద ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవనం చేస్తున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి కావాలంటే వేదవతి ప్రాజెక్ట్ నిర్మాణమే ఏకైక శరణం వేదవతి ప్రాజెక్టుకు నిర్మాణానికి 1942 కోట్ల ఖర్చుతో ఆలూరు హలహార్వి చిప్పగిరి హోలగుంద మండలాల్లో 80,వేల ఎకరాలకు సాగునీరు 253 గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చని నిపుణులు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి నిర్మాణానికి నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేతులు దులుపుకుంది ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతన్నలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారం ఇవ్వవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా భూసేకరణ పూర్తి చేయకుండా రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది నిత్యం కరువుకు గురయ్య ప్రాంతంలో సిరులు కురిపించే వేదావతి ప్రాజెక్టు నిర్మాణం పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నది అర్థాంతరంగా పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో అంత చిక్కడం లేదు నియోజకవర్గంలో ఆస్పరి మండలంలో ఎటువంటి నీటి వనరులు లేవు మండలాన్ని వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చి మండల ప్రజలకు త్రాగునీరు త్రాగునీరు ఇవ్వాలని ఆలోచన పాలకులు లేకపోవడం చాలా బాధాకరం వేదవతి ప్రాజెక్ట్ పరిధిలోకి ఇప్పటికైనా ఆస్పరి మండలాన్ని చేర్చి అన్ని గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందించినచేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని వారు డిమాండ్ చేశారు.
డిమాండ్స్
1. వేదవతి ప్రాజెక్టును 08 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలి
2. హోళగుంద నుండి ఆదోని హోళగుంద మార్లమడికి రోడ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి
3. ఆలూరులో ప్రభుత్వ ఆసుపత్రికి వంద పడకల స్థాయికి పెంచాలి
4. ఆలూరులో డిగ్రీ పాలిటెక్నికల్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలి
5. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను విరమించుకుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
6. అమరావతిని రాజధానిగా ఉంచి రైతుల పరిహారం చెల్లించాలి
7. యువజన విద్యార్థుల ఉపాధి కల్పనా కొరకు నూతన పరిశ్రమలు ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి
8. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ తో పాటు ఇతర జాతీయస్థాయి విద్య వైద్య సదుపాయాలు కల్పించాలి.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప సహాయ కార్యదర్శి రంగన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ రైతు సంఘం నాయకుడు కృష్ణ సిపిఐ నాయకులు అసిన్ భాష తదితరులు పాల్గొన్నారు.