NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాకు ప్రాణ రక్షణ కల్పించండి…

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ :  కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వారి కుమారులు నుండి ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా, కోరుతున్నామని శావ నాగ జగన్ బాబురావు కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ,నేను రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సిపి స్థాపించి పాటి నుండి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే విషయంలో కష్టపడి పని చేశానని ,కైకలూరు ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి మొగ్గు చూపుతున్నారని, ఆయన ఎమ్మెల్యే కావడానికి నేను ఎంతో సహాయపడినాని  మన నియోజకవర్గంలో కొల్లేరు సరస్సు సర్వనాశనం చేశారని, ఆరోపించారు. మా ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటామని, ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకి కొమ్ముకాస్తున్నారని వారి కుమారులు కోడిపందాలు, పేకాట , ఆసాంఘిక కార్యక్రమాలు నిలయంగా కైకలూరు నియోజకవర్గం తయారు చేస్తున్నారని, ఆరోపించారు. దళితులుగా మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వడానికి ఎంతో కృషి చేశామని శావా నాగ జగన్ బాబురావు భార్య శావ మరియమ్మ మాట్లాడుతూ నా భర్త గత 24 సంవత్సరముల నుండి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడుగా దళిత సంఘాల నాయకులుగా పనిచేస్తున్నాడని వైయస్సార్ పార్టీకి నా భర్త ఎంతో కృషి చేశాడని గెలిచిన తర్వాత పార్టీ కోసం కష్టపడినటువంటి వారిని పక్కన పెట్టినారని , స్థానిక ఎమ్మెల్యే వారి కుమారులు నా భర్తను కుల పరంగా దూషిస్తూ నా భర్త మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, నా భర్త కుమా కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా,  కులమత బేధాలు లేకుండా నాకు నా భర్తకు అన్ని కులాలు వారు అండగా ఉంటారని కైకలూరు నియోజకవర్గం ప్రజలను కోరుతున్నామని ఆమె అన్నారు.

 

About Author