సావిత్రిబాయి పూలే 126 వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రి లోని 17 వ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే 126 వ వర్ధంతిని అంగన్వాడి టీచర్ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా లోకానికి ఆదర్శం అన్నారు. సతీసహగమనం మూఢనమ్మకాలు రూపుమాపి బాల్య వివాహాలు నిషేధించి మరెన్నో మహిళా హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. అనాధాశ్రమాలను, విద్య నిలయాలను నెలకొల్పి మహిళా విద్యా వికాసానికి పునాదులు వేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవనందిస్తూ, చివరికి ప్లేగు వ్యాధితోనే మరణించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి చిన్నారుల తల్లులు, గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.