బాలికా విద్యకు, సాంఘిక సంస్కరణకు సావిత్రిబాయి పూలే పెద్దపీట
1 min read– సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయిని సావిత్రమ్మకు ఘన సన్మానం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తాడిత పీడిత ప్రజల సంక్షేమం కోసం, నూతన సమాజం కోసం, బాలిక విద్య కోసం జీవితాంతం పోరాటం చేసిన ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే అని ఎంఈఓ గంగిరెడ్డి అన్నారు, బుధవారం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రెండవ రోజు జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశంలో ఆయన సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన సావిత్రి బాయ్ పూలే జయంతిని పురస్కరించుకొని మండలంలోని చిన్న మాచుపల్లి ఎంపీపీ హరిజనవాడ పాఠశాల యందు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తులసమ్మ ను ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే, సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా, అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు, సావిత్రిబాయి పూలే 1831 జనవరి మూడవ తేదీన జన్మించారని, ఆమె బాలిక విద్యపై అనేక పోరాటాలు చేయడమే కాకుండా, ఆమె సమకాలీన సమస్యలపై, సాంఘిక దురాచారాలపై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే విధంగా పోరాటం కొనసాగించారని తెలిపారు, బాలిక విద్య ద్వారా సమ సమాజ నిర్మాణం జరుగుతుందని ఆశించి బాలిక విద్యపై ఎనలేని కృషి చేశారని ఆయన తెలియజేశారు, అలాగే చిన్న మాచుపల్లి హరిజనవాడ ఎంపీపీ ఎస్ లో పనిచేస్తున్న తులసమ్మ సేవలు కూడా మరువలేనివని ఆమె విద్యార్థులపై, ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఆమెను ఈ సందర్భంగా సన్మానించుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.