ఘనంగా సావిత్రిబాయి పూలే 194 వ వర్ధంతి
1 min read
ఎమ్మిగనూరు , న్యూస్ నేడు: పట్టణంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు శావల బుజ్జిబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు తాలూకా ఇన్చార్జి ఎం సీ గిడ్డయ్య మాదిగనందవరం మండలం ఇన్చార్జి చింపిరి చిన్న పోతప్ప పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సింగనేటి నరసన్న ప్రతిభ భారతి మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు డా కామళేగణేష్ పూలే అంబేడ్కర్ ఐడియాలజీ కన్వీనర్ ఏసీ దేవదానం మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల మహానాడు తాలూకా ప్రెసిడెంట్ గడ్డం హుస్సేని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే 1831 జనవరి 3 ,1897 మార్చి 10 భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయిని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగ శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు 1897లో పూణేలో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది నిరాశ్రయులు అయినప్పుడు కొంగు జాల పట్టి రోజు రెండువేల మంది పిల్లలకు ఆహారం ఏర్పాటు చేసి అమ్మ తనాన్ని చాటుకుంది ప్లేగు వ్యాధి సోకి తను 1897 మార్చి 10 తుది శ్వాస విడిచారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రామచంద్ర జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షులు సంధ్య పోగు ఎర్రన్న పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈసీ మెంబర్ జి మనోహర్ ఈసీ నెంబరు కుమ్మరి నాగరాజు నందవరం మండలం ఎమ్మార్పీఎస్ నాయకులు మూగతి ప్రతాప్ ఎమ్మార్పీఎస్ గోనెగండ్ల మండలం నాయకులు ఎన్ ఆంజనేయులు చక్రవర్తి చిన్న యోహాను కందనాతి మస్లిం తదితరులు పాల్గొన్నారు.