PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సావిత్రి కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన దళిత వ్యవసాయ కూలీ సావిత్రమ్మ కుటుంబానికి 50 లక్షల ఎక్స్​పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన దళిత వ్యవసాయ కూలీ సావిత్రమ్మ కుటుంబానికి 50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, మండల నాయకులు పి పకీరసాహెబ్ , బి రజిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నందికొట్కూరు జనరల్ హాస్పిటల్ లో మృతి చెందిన సావిత్రమ్మ సందర్శించారు. అనంతరం తీవ్ర గాయాలైన సుంకమ్మ ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పెద్దమనిషి నాగిరెడ్డి పొలానికి ఏపీ 21 టీ జెడ్ 65 33 నెంబర్ గల ట్రాక్టర్​లో మినుము మిషన్ పని చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాక్టరు అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో మినుము మిషన్ వారి పైన పడడంతో సావిత్రి 28 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు పోస్టుమార్టంకి తరలించారు. విజయమ్మ, లక్ష్మీదేవి, సుంకమ్మ ను తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిపిఎం బృందం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్​గ్రేషియా, ఐదెకరాల భూమి ఇచ్చి , సావిత్రమ్మ ఇద్దరు పిల్లల్ని ఉచితంగా చదివించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గాయాలైన వారికి ప్రభుత్వ మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు .కార్యక్రమంలో యేసురాజు .భర్త రమేష్ గ్రామ పెద్దలు నాగన్న, రామకృష్ణ వెంకటేశ్వర్లు చందు ,ఏసన్న, నరసింహ, అరుణమ్మ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


About Author