NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌త‌కం తెస్తాన‌ని ముందే చెప్పి.. తెచ్చింది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టోక్యో ఒలంపిక్స్ లో సెమీ ఫైన‌ల్ కు చేరుకుని ప‌త‌కం ఫైన‌ల్ చేసుకుంది బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్. ప్రపంచ ఛాంపియ‌న్ బుసేనాజ్ సుమెనెలితో లవ్లీనా బుధ‌వారం సెమీస్ లో పోరాడ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆమె తండ్రి స్పందించారు. అస్సాం మొత్తం ఆమె గెలుపు కోసం పోరాడుతోంద‌ని చెప్పారు. దేశానికి ఒలంపిక్ ప‌త‌కం తీసుకొస్తాన‌ని లవ్లీనాకు ఎంతో న‌మ్మకముండేద‌ని , ఆ విష‌యాన్ని నిజం చేసింద‌ని ఆమె తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. టోక్యోకు వెళ్లే ముందు కూడ .. ప‌త‌కంతో ఇంటికి తిరిగి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లింద‌ని లవ్లీనా తండ్రి వెల్లడించారు. గ‌త నెల 30న జ‌రిగిన క్వార్టర్స్ పోరులో చైనాకు చెందిన నీన్-చిన్ పై 4-1 తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

About Author