PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేనమామా అంటూ ప్రజలకు శఠగోపం..

1 min read

– నంద్యాల టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి. టిడిపి పాణ్యం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పల్లె వెలుగు , వెబ్ గడివేముల : ఆదివారం నాడు మండల కేంద్రంలోని బూజునూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో నంద్యాల టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లిందని ఆరోపించారు అభివృద్ధి అంటే గుంతలు పడ్డ రోడ్లు దోచుకో దాచుకో అనే రకంగా వైసిపి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని మండలానికి వెలగమాను డ్యామ్ తెస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఎక్కడ అంటూ ఏద్దేవ చేశారు కనీసం రెండు సంవత్సరాలైనా అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు ముందుకు సాగటం లేదని మూడు మండలాల రైతులకు సాగునీరు అందించి కడపకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కు గ్రహణం పట్టిందని కనీసం మూడు కోట్లతో పనులు చేసే నిధులు లేక చేతులెత్తేసారని ఆరోపించారు మద్యం పాల సి అంటూ సొంత బ్రాండ్లను అధిక ధరలతో నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు ముఖ్యంగా మైనార్టీలకు లోన్లు షాది ముబారక్ కింద లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఇప్పుడు వధువు వరుడు పదో తరగతి చదువుకొని ఉంటే నే పథకం కింద లబ్ధి పొందుతారని మోసం చేస్తున్నారని ఆరోపించారు పంచాయతీ నిధులను దిగమింగి వైసిపి చెందిన సర్పంచ్ లే నిధులు కావాలంటూ బిక్షాటన చేస్తున్నారని మండలంలో టిడిపి క్యాడర్ నాయకులు బలంగా ఉన్నారని కచ్చితంగా ఈసారి మండలంలో టిడిపి మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ ప్రజల మీద అధిక భారం మోపి పేదల నడ్డి విరుస్తున్నారని ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టారని కనపడిన భూములను కబ్జా చేస్తూ తాసిల్దారులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను ఎంచక్కా భోం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ద్వంద విధానాలను అధిక ధరలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు రానున్న ఎన్నికలలో సమర్ధుడు సీనియర్ రాజకీయ నాయకుడు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిడిపి పార్టీకి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కో కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర టిడిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుభద్రమ్మ. పంట రామచంద్రారెడ్డి . పంట దిలీప్ కుమార్ రెడ్డి. పంట మద్దిలేటి రెడ్డి. బీసీ సెల్ పాణ్యం అధ్యక్షుడు కృష్ణ యాదవ్.. టిడిపి మండల మాజీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. చిందుకూర్ సర్పంచ్. అనసూయమ్మ. శ్రీనివాసులు. మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఏ ఫరూక్. ఉండుట్ల సర్పంచ్ గంగాధర్ రెడ్డి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author