PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆన్ లైన్ టికెట్ల పేరు చెప్పి అప్పు తెచ్చుకుంటాడు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: సినిమా టికెట్ల‌ను ఆన్ లైన్ లో అమ్మాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఒక మేధావని అన్నారు. ఆయ‌న సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటాడని ఎద్దేవా చేశారు.  “ ప్రభుత్వ ఆస్తులు అమ్మతున్నాడు  లేదా తాకట్టు పెడుతున్నాడు.. సీఎంకు అనుభవం లేదు. అహంభావము మాత్రం చాలానే ఉంది. జగన్ రెడ్డి అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి లాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారు“ అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

About Author