NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌ష్యాతో లావాదేవీల‌కు ఎస్బీఐ క‌టీఫ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా పై అమెరికాతో పాటు, యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు ఆంక్ష‌లు విధించాయి. ఈ ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా బ్యాంకులు, కంపెనీలకు దూరం గా ఉండాలని ఎస్‌బీఐ నిర్ణయించినట్టు సమాచారం. ఆంక్షల జాబితాలోని సంస్థలకు చెందిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ప్రాసెస్‌ చేయడం కుదరదని ఎస్‌బీఐ ఇప్పటికే కొన్ని సంస్థలకు స్పష్టం చేసింది. అయితే ఎస్‌బీఐ దీనిపై అధికారికంగా నోరు మెదపడం లేదు. అమెరికా నాయకత్వంలో నాటో, ఈయూ దేశాలు.. రష్యా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఇప్పటిక కీలకమైన ‘స్విఫ్ట్‌’ సమాచార వ్యవస్థ నుంచి తప్పించాయి. ఇలాంటి సంస్థల ఆర్థిక లావాదేవీలు ప్రాసెస్‌ చేస్తే, తమకూ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భారతీయ బ్యాంకులు భావిస్తున్నాయి.

                                      

About Author