ఎస్బీఐ ఫలితాలు అదుర్స్ !
1 min readపల్లెవెలుగు వెబ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ఫలితాలను వెలువరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టంబర్ లో నికర లాభం 69 శాతం జంప్ చేసి 8,890 కోట్లను చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 5,246 కోట్లను మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 95,374 కోట్ల నుంచి 1,01,143 కోట్లకు చేరింది. స్టాండ్ అలోన్ నికరలాభం 67 శాతం ఎగిసి 7,627 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో 4,574 కోట్లు ప్రాఫిట్ సాధించింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్ కమ్ 11 శాతం వృద్ధి చెందింది. క్యూ2లో ఎన్పీఏలు 5.28 శాతం నుంచి 4.9 శాతానికి క్షీణించాయి. నికర ఎన్పీఏలు 1.59 శాతం నుంచి 1.52 శాతానికి చేరాయి.