PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి

1 min read

జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్

ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….పోలీస్‌, రెవెన్యూ,   ప్రాసిక్యూషన్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదు అయిన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా… సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని.. ఎఫ్ఐఆర్ కాగానే బాధితులకు పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. చాలా వరకు శిక్ష పడే కేసులు అనుకున్నంత సాధించలేకపోతున్నారని… ఇందుకు కేసు పెట్టినవారు వాటిని వాపసు తీసుకోవడం ప్రధాన కారణం అన్నారు. ఏదేమైనా జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలని డివిఎంసి కమిటీ సభ్యులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీసులతోపాటు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కేసులలో ఎప్పటి కప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలోగా కేసులను పూర్తిచేయాలన్నారు.సమావేశంలో  ఎమ్యేల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అణగారిన వర్గాలలో జరుగుతున్న అన్యాయాలపై రాజ్యాంగ విలువలు, హక్కులను కాపాడేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు.  జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ…. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. .ఈ కార్యక్రమంలో  రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్డీఓలు రంగస్వామి, మురళిలు, రామకృష్ణరెడ్డి, డిఎస్పీలు మహబూబ్ బాషా, కేశప్ప, విఎన్ కే చైతన్య, ఎస్సి ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికారికత జిల్లా అధికారి జాకీర్ హుస్సేన్, జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారి అబ్సలోమ్, జిల్లా నిఘా కమిటీ సభ్యులు చుక్కా అంజనప్ప, సగినాల శివ తదితరులు పాల్గొన్నారు.

About Author