ఎస్సీ బాలుర హాస్టల్లో… సమస్యల వెల్లువ
1 min readపరిష్కరించాలని కోరిన జెడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ : వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో సమస్యలు ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు శ్రీరంగాపురం జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ యాదవ్. శనివారం హాస్టల్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ఆయనకు… విద్యార్థులు పలు సమస్యలు వెల్లడించారు. హాస్టల్ కిటికీలకు జాలి లేకపోవడంతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని, దీంతో రోగాల బారిన పడుతున్నామన్నారు. స్లిప్పర్లు కాస్మోటిక్ మరియు కటింగ్ బిల్లులు గతంలో ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వడంలేదని విద్యార్థులు జెడ్పీటీసీకి వివరించారు. హాస్టల్లో బోరు చెడిపోవడం వల్ల తాగడానికి, స్నానాలకు నీరు లేవని, మిషన్ భగీరథ నుంచి కూడా నీరు రాకపోవడంతో.. దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ట్రంకు పెట్టెలు కూడా ఇవ్వలేదని కనీసం లాకర్లు ఏర్పాటు చేయలేదని మరియు హాస్టల్లో ట్యూషన్ చెప్పేటటువంటి హిందీ పండితులేరని దానివల్ల హిందీ సబ్జెక్టులో వెనక్కి పడిపోవాల్సి వస్తుందని ఎనిమిదో తరగతి 9వ తరగతి పదవ తరగతి విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల సమస్యలు విన్న జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ యాదవ్.. సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరారు.