NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి….

1 min read

– ఈ నెల 6 న మాదిగల విశ్వరూప సన్నాహక మహాసభను జయప్రదం చేయండి..

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  స్థానిక హొళగుంద ఎమ్మార్వో కార్యాలయం ఆవరణం లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పకీరప్ప మాదిగ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 6 న ఆదోనిలో జరగబోయే మాదిగల విశ్వరూప సన్నహాక మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ వస్తున్నారు కావున ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు ఆదోని నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని విశ్వరూప సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎం ఎస్పి ద్వారా పిలుపునిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున,సిద్ధప్ప,కంచప్ప, బసప్ప, నాగరకన్వి వెంకటేష్, గజ్జహల్లి ఎల్లప్ప, జాకోబ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author