ఎస్సీ వర్గీకరణ బిల్లును.. పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలి : ఎంఆర్పీఎస్
1 min readపల్లెవెలుగు. నందికొట్కూరు: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు కు చట్టబద్ధం కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు స్వాములు మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాముల పాడు మండలం కో ల్స్ ఆనందపురం గ్రామంలో హలో మాదిగ విద్యార్థి చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఆనందపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు మాదిగ మాట్లాడుతూ మాదిగ చిరకాల వాంఛ షెడ్యూల్డు కులాల వర్గీకరణ అని బీజేపీ ప్రభుత్వం వేస్తే 100 రోజుల్లో చట్ట బద్ధత చేసి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వ డిసెంబర్లో జరిగే ఈ పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ కు చట్టబద్ధత చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు సునీల్ విద్యార్థులు అక్షయ్, శరత్ జయచంద్ర, శ్యామ్ చార్లెస్, యోహాన్, సమేష్, తదితరులు పాల్గొన్నారు.