ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎస్సి వర్గీకరణకుచట్టబద్ధత కల్పించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ కు ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ రాజు మాదిగ , విజ్జి మాదిగలు బుధవారం యువగళం పాదయాత్రలో వినతిపత్రం అందజేశారు . మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వివరించారు. మండుటెండలో రోడ్లు పక్కన చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్న మాదిగల జీవితాలు చాలా దుబ్బరంగా ఉన్నాయని వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు . అలాగే డప్పు కళాకారులకు రూ.5 వేల పెన్షన్ ప్రకటించాలని కోరారు. ప్రతిపక్షపార్టీగా మీరు అసెంబ్లీ చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందిస్తూ మాప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యచరణలు అమలుచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.