ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి: MSP
1 min readఅన్నమయ్య జిల్లా జేసీకి వినతిపత్రం సమర్పించిన ఎం ఎస్పీ జాతీయ నాయకులు రామాంజనేయులు
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: ఎస్సీ వర్గీకరణకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం ప్రకారం రెండు రాష్ట్రాల్లో చేపట్టిన మహా దీక్షలో భాగంగా ఈ దినం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎం ఎస్ పి జాతీయ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో మహాదీక్ష కార్యక్రమం నిర్వహించడమైనది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు ఇచ్చిన హామీని ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజ్యాంగం ప్రసాదించిన 15% రిజర్వేషన్లు ఒక వర్గం వారే దోచుకుంటున్న దరిమిలా గత 28 సంవత్సరాలుగా వర్గీకరణ కొరకు పోరాటాలు జరుగుతున్న విషయం విధితమే ఎంతోమంది ఆత్మబలిదానం చేసుకున్న నేటికీ వర్గీకరణ జరగకపోవడం శోచనీయం ఎస్సీలలోని మాదిగ మాదిగ ఉప కులాలు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ సంక్షేమ రంగాలలో వెనుకబాటును గుర్తించి భారతీయ జనతా పార్టీ వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు జస్టిస్ రామచంద్రరాజు ఉషా మేహర కమిషన్లను గౌరవించి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదింప చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైనది తదుపరి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బండ్లకింద మనోహర్,తిరుపాల్ ఎమ్మెస్ పి నాయకులు నారాయణ సుబ్బయ్య బద్రి డి ఈశ్వరయ్య రామానుజులు శివయ్య శంకర శ్రీను ఎంఆర్పిఎస్ నాయకులు సాయి బాలాజీ సురేష్ బాబు అన్నమయ్య వెంకటేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.