ఎస్సీ కాలనీ పై అధికారి చిన్న చూపు…
1 min read
ఎస్సీ కాలనీ సిసి రోడ్డు ఈ బీసీ కాలనీకి ఎలా వేస్తారు, ఎస్సీ కాలనీ పై అధికారి చిన్న చూపు,ఖండించిన జనసేన కో- కన్వీనర్ వరాల వీరేష్,
హొళగుంద, న్యూస్ నేడు: మండల కేంద్రంలో బుధవారం, ఎస్సీ కాలనీకి చెందిన జనసేన కో కన్వీనర్ వరాల వీరేష్, ఎస్సీ కాలనీ వాసులు, సిద్దు శేషగిరి జనార్ధన్, వారు మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి మంజూరైన సిసి రోడ్డు ను ఎస్సీ కాలనీ కి వెయ్యకుండా ఈ బీసీ కాలనీలో వేయడంపై ఎస్సీ కాలనీ వాసులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు డ్రైనేజీలు లేక,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూటమి ప్రభుత్వంలో ఎస్సీ కాలనీకి, 5, లక్షల రూపాయల గ్రాంట్, తో నిధులు మంజూరు అయినాయి, సీసీ రోడ్డును సంబంధిత అధికారులు ఎస్సీ కాలనీలో వేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వివక్షతను చూపుతూ ఈ బీసీ కాలనీలో వేశారని మండిపడ్డారు ,ప్రధానంగా మండల పి ఆర్, ఇంజనీర్ యమునప్ప కారణమని జనసేన కో కన్వీనర్ వరాల వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు, ఎస్సీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి, పనులను వివక్షత కారణంగా ఇతర కాలనీలలో పనులు చేపట్టారని అలాగే మా కాలనీ కి శాంక్షన్ అయినా సిసి రోడ్డును వేరే కాలనీకి ఎందుకు వేశారని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు లేని చోట సీసీ రోడ్లు వేయాలని లేనిచో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎస్సీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు, పై అధికారులను కోరుతూ ఎంపీడీవో ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అవసరమైనటువంటి అభివృద్ధి పనులను జిల్లా అధికారుల దృష్టికి తీసుకోపోవాల్సిందిగా కావాల్సిన నిధులను మంజూరు చేయాల్సినదిగా ఎస్సీ కాలనీవాసులు కోరారు.