ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్పర్సన్ ని కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
1 min read
ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు మరింత చెరువుగా పనిచేయాలి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నూతనంగా ఎస్ సి కార్పొరేషన్ ఈడి గా పదవి బాధ్యతలు చేపట్టిన ఎం. ముక్కంటి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఈ రోజు జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ని పుష్పగుచ్చం అందించే మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా, జడ్పీ చైర్‌పర్సన్ ముక్కంటి కి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రభుత్వ పథకాల అమలు గురించి చర్చ జరిగింది. ముఖ్యంగా ఎస్‌సి కార్పొరేషన్ లోన్లు మరియు ఎస్‌సి సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చెయ్యాలని కోరారు.