‘ఎస్సీ హాస్టల్’ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా: ఎంపీపీ
1 min readపల్లెవెలుగు వెబ్,చెన్నూరు: కడప జిల్లా చెన్నూరు స్థానిక కె ఆర్ కాలనీలోని ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాన్ని బుధవారం ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, పంచాయతీరాజ్ ఏఈ మురళి లు పరిశీలించారు,, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు, ఇక్కడ విద్యార్థులకు సంబంధించి త్రాగు నీటి కొరత, అదేవిధంగా టాయిలెట్లు, హాస్టల్ గదులలో బండ పరుపు కృంగిపోయి ఉండడం జరిగిందన్నారు, వీటన్నిటిని కూడా పరిశీలించి తదుపరి ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసు కు పో వడం జరుగుతుంది అన్నారు, అలాగే ఈ పనులను నాడు- నేడు ద్వారా చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు, అంతేకాకుండా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు, విద్యార్థులకు ఆయన నాడు నేడు పథకం ద్వారా విద్యా వ్యవస్థను ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగిందన్నారు, అలాగే విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతోపాటు, నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు, ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు, అలాగే సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ లో ఇప్పటికి దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు, అంతేకాకుండా మండలంలోని గ్రామాలలో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను వసతి గృహంలో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ (ఎస్ డబ్ల్యూ ఓ )భాస్కర్ కు సూచించారు, హాస్టల్ కు సంబంధించి అన్ని వసతులు సమకూర్చి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరుగుతుందన్నారు.