సీఎంకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రుణపడి ఉన్నారు
1 min read– దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక చట్టాన్ని మరో పదేడ్లు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లంత ఎంతో రుణపడి ఉన్నారని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దళిత గిరిజన ల ఉపపురణాలుగా చట్టం గతంలో 195 సంఘాలు కలిపి ఉద్యమం చేసి ఎస్సీ ఎస్టీలకు చట్టాన్ని సాధించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోవు 10 సంవత్సరాలు కాలపరిమితిని పెంచినందుకు ప్రత్యేకంగా దళిత సంఘాలు ఎస్టీ సంఘాల హర్షద్వారాలు వినిపిస్తున్నారని ఈ గడువు జనవరి 2023 తో ముగుస్తుందని దాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక పది సంవత్సరాలు పెంచినందుకు ఆర్డినెన్స్ను విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని మరో పదేడ్లు పెంచి ఆర్డినెన్స్ తెచ్చి ఎస్సీ ఎస్టీల పైన ముఖ్యమంత్రి చూపుతున ప్రేమ ఆదరణ తన ఉనికిని కాపాడుకున్నారని కొనియాడారు.