ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి
1 min read
అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్షించిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి
సమావేశంలో పాల్గొన్నజెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాస్ధాయి విజిలెన్స్, మోనిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, కమిటీ సభ్యులు జి.మోహన్ రావు, టి. రాజేష్ బాబు, ఎల్. ప్రవల్లిక, మట్టారాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కేసుల ధర్యాప్తు పూర్తిచేసి నిర్ధేశించిన సమయంలోపు చార్జిషీటు ధాఖలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. దర్యాప్తులో పూర్తి ఆధారాలు సేకరించి సకాలంలో ఛార్జిషీటు ఫైల్ చేయాలన్నారు. రానున్న సమావేశం నాటికి నిర్ధేశించిన సమయంలోపు ఛార్జిషీటు ధాఖలు చేయని ఏఒక్కకేసు పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు తప్పనిసరిగా ఒకసారి జిల్లాస్ధాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంతంలోని పాఠశాలల్లో విద్యార్ధులకు ఆట సామాగ్రి అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో జిల్లా యంత్రాంగం పటిష్టంగా పనిచేయడం మూలంగా కేసులుకూడా తగ్గుముఖం పట్టాయని పలువురు కమిటీ సభ్యులు పేర్కోన్నారు. గిరిజన ప్రాంతంలో పలు రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని సదరు పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈఏడాది ఫిబ్రవరి మాసం వరకు 41 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు. 41 కేసులకు సంబంధించి రూ. 25.50 లక్షలు పరిహారం మంజూరు చేయడం జరిగిందన్నారు. మరో రూ. 13.25 లక్షలు పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, ఐటిడిఏ పివో కె. రాములు నాయక్, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, సోషల్ వెల్పేర్ జెడి జయప్రకాష్, డి ఆర్ డి ఎ పిడి ఆర్.విజయరాజు,ఆర్డివోలు అచ్యుత్ అంబరీష్, ఎం.వి. రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.