సామాజిక సాధికార బస్సు యాత్రకు పోటెత్తిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు కొత్త రోడ్డు పరిధిలోని కొత్త గాంధీనగర్, అరుంధతి నగర్, బెస్త కాలనీ, లక్ష్మీ నగర్, సరస్వతి నగర్, రాజుల కాలనీలా నుండి భారీగా తరలి వచ్చారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామాజిక సాధికార సభా ప్రాంగణానికి, చెన్నూరు కొత్త రోడ్డు నుండి, కోలాహలంగా ర్యాలీతో రావడం జరిగింది, అడుగడుగునా జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు, డప్పు వాయిద్యాలతో హంగామా చేశారు, ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం అనేది ఒక వైఎస్ఆర్సిపి పార్టీతోనే సాధ్యమైందని, అన్ని కార్పొరేషన్లకు చైర్మన్ ల తో పాటు డైరెక్టర్లను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వడం జరిగిందని, ఇది ఒక సామాజిక విప్లవమని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంత పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి వారిని గౌరవప్రదమైన పదవులలో ఉంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు, సామాజిక సాధికార యాత్ర అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మనోభావాలకు సంబంధించిన యాత్ర అని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగిందని వారు తెలియజేశారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతంగా జరగడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు , ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీతారామయ్య, నిత్య పూజ్య, మల్లెం మనోహర్, మాదన శాంతయ్య, లక్ష్మయ్య, లేవాకు నిజమయ్య, జకరయ్య, ఇల్లూరి రమణ, చంద్ర, మధు కుమార్, రమణ, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.