అభివృద్ధికి కృషి చేసింది ఎస్సీ,ఎస్టీ,బీసీలే.. ఆత్మహత్యలు వద్దు..
1 min readపల్లెవెలుగు వెబ్: కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. కోర్టులు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్ల పై కక్షసాధింపు ఎందుకని ప్రశ్నించారు. గ్రామాభివృద్ధికి కృషి చేసింది ఎస్సీ,ఎస్టీ, బీసీలేని అన్నారు. వారిని ఆర్థికంగా అణగదొక్కడం హేయమని అన్నారు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రతి పైసా చెల్లించే వరకు అండగా ఉండి పోరాడతామని హామి ఇచ్చారు.