ఆర్ఆర్ఆర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు
1 min readపల్లెవెలుగువెబ్ : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ను కులం పేరుతో పాటు, అసభ్యపదజాలంలో దుషించాడని గొంది రాజు అనే వ్యక్తి చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. చింతలపూడి ఏపీ సునీల్ కుమార్ సొంతగ్రామం. రాజు ఫిర్యాదుతో రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చింతలపూడి పోలీసులు తెలిపారు. ఇటీవల సీఐడీ విచారణకు హాజరు కావాలని రఘురామరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులిచ్చిన తర్వాత రఘురామ సీఐడీ అధికారి సునీల్ కుమార్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, గొంది రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు.