ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆక్ట్ 2013 ను పునరుద్ధరించాలి
1 min read– మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల.రాజకుమార్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: జనవరి14 శనివారం చట్టసభల్లో దళితుల కోసం కేటాయించిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తిరగబడే విధంగా ఎస్సీ ఎస్టీల అందరు కలిసికట్టుగా ఏకమవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు యనముల రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఇందిరానగర్ సమీపంలో ప్రముఖ న్యాయవాది కార్యదర్శి రవికుమార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ ఆక్ట్ 2013లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయ్యిందని గుర్తు చేశారు . 2023 జనవరి కి ముగియనుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యాక్టు 2013 వల్ల సోషల్ వెల్ఫేర్ షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్ వల్ల ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా, విద్యాపరంగా, పారిశ్రామికంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టాన్ని అమలులోకి చేయడం జరిగిందన్నారు. దళితుల అభివృద్ధి అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుందన్న ఈ యాక్టు 2013 షెడ్యూల్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్ పొడిగించాలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా దళితులు ఇంకా వెనుకబాటతనం, అంటరానితనం ఉండడం పరిపాలించిన రాజకీయ నాయకులు బాధ్యత వహించాలని తెలిపారు . ఇప్పుడున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర వాటికి బదిలీ చేయకుండా కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కేటాయించాలి. పత్రిక ముఖంగా వైసీపీ ప్రభుత్వానికి తెలియజేశారు . ఈ కార్యక్రమంలో సగినాల సురేష్ సమతా సైనిక్ దళ్ నందికొట్కూరు అధ్యక్షులు, తలారి నాగరాజు రాష్ట్ర కార్యదర్శి, కల్లుబండి నాగరాజు సమతా సైనిక్ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల మహానాడు నాయకులు అబ్రహం , మాల మహానాడు జిల్లా కార్యదర్శి కలుబండి అంకన్న, తదితరులు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేశారు.