PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ ఎస్టీ సబ్ – ప్లాన్ శాశ్వత చట్టంగా మార్చాలి: కెవిపిఎస్

1 min read

– ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లించకుండా దళితుల ప్రయోజనాలకే ఖర్చు చేయాలి:కెవిపియస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ ఐక్య పోరాటం ద్వారా సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013 యొక్క నియమ నిబంధనలు చాప్టర్ 4 ద్వారా జనవరి 23 కు దాని యొక్క కాలపరిమితి ముగిసిందన్నారు. గత వారాలుగా కెవిపిఎస్ కలిసి వచ్చిన సంఘాలను రాష్ట్రవ్యాప్తంగా కలుపుకొని నిర్వహిస్తున్న పోరాటాలను గౌరవించి చట్టాన్ని మరో 10 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పొడగించి, చావు బతుకుల మధ్య ఉన్న చట్టానికి ఆక్సిజన్ ను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే చట్టానికి ఆక్సిజన్ అందించడం కాదు సంపూర్ణ ఆయుష్షును పొసేవిధంగా శాశ్వతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల కాలంలో కేవలం 54.5% నిధులు మాత్రమే ఖర్చు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సబ్ ప్లాన్ కు 15 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించినా.. దళిత గిరిజనుల కోసం మాత్రమే ఖర్చు పెట్టాల్సిన ఈ నిధుల నుండి 9422 కోట్లు తిరిగి అందరికీ ఉపయోగపడే రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసమే ఖర్చు చేసి దళితులకు ఖర్చు చేసినట్లుగా చెప్పడం ఇది ఎక్కడి న్యాయం అన్నారు.సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయడంతో పాటు నిధులను దళితుల జనాభా ప్రాతిపదికన కేటాయించి, దళితుల ప్రత్యక్ష ప్రయోజనాలకే వాటిని ఖర్చు చేయాలన్నారు. నిధులను దారి మళ్లించకుండా, ఒకవేళ నిధులు మిగిలిపోయినా, వచ్చే సంవత్సరం బడ్జెట్ తో పాటు వాటిని కలిపి ఖర్చు చేయాలన్నారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా కలిసివచ్చే శక్తులన్నిటినీ కలుపుకొని మరో సామాజిక ఉద్యమాన్ని నిర్వహిస్తామని అన్నారు.

About Author