ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్సై తిమ్మారెడ్డి..
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : సోమవారం జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను శనివారం ఎస్సై తిమ్మారెడ్డి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పోలింగ్ బూతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రులకు పోలింగ్ బూత్ నంబర్ 247 లో రెండు గదులను, ఉపాధ్యాయ ఓటర్లకు ఒక గదిని కేటాయించినట్లు వారు తెలిపారు. అలాగే ఓటు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, మండలంలో పట్టభద్రులు 1516 మంది మరియు ఉపాధ్యాయలు 46 మంది ఎమ్మెల్సీ ఓటు ను వినియోగించు కోనున్నట్లు తెలిపారు. కావున పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించరాదని ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు.