PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెన్త్ , ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ఓపెన్ స్కూల్స్ టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. పరీక్షల షెడ్యూల్‌‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. మే నెల 2వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తెలుగు పరీక్ష ఉంటుందన్నారు. మే నెల 4వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ పరీక్ష, మే నెల 5వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ వారికి గణితం పరీక్ష జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మే నెల 7వ తేదీన 10 తరగతికి శాస్త్ర, సాంకేతిక విజ్ఙానము, ఇంటర్మీడియట్‌‌కి భౌతికశాస్త్రం, మే నెల 9వ తేదీన 10 తరగత కి సాంఘిక శాస్త్రము, ఇంటర్మీడియట్‌‌కి రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు.

                                       

About Author