NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

14న స్కీమ్ వర్కర్ల ‘చలో విజయవాడ’ : ఏఐటీయూసీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: రాష్ట్రంలో స్కీం వర్కర్స్ గా పని చేస్తున్నారు ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 14వ తేదీన 3 సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఏఐటీయూసీ కమలాపురం ఏరియా కార్యదర్శి పి చంద్రశేఖర్ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి సుభాషిని లు పిలుపునిచ్చారు గురువారం నాడు స్థానిక చెన్నూరు లోని విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ మాతా శిశు మరణాలను తగ్గించడానికి బాలింతల మొదలుకొని పుట్టిన బిడ్డలను సైతం సురక్షితంగా ఆరోగ్యవంతంగా పెంచడానికి కావలసిన సలహాలతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వారికి టీకాలు సరఫరా చేస్తూ వారి ఆలనాపాలనా చూస్తూ నా ఆశ అంగన్వాడీల పట్ల బడిబయట పిల్లల ను బడిలో కి పంపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా అప్పు చేసి పౌష్టిక ఆహారాన్ని వండి అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు ప్రకటించిన 15 వేల రూపాయల జీవోను విడుదల చేయాలని జరిగే ఈ కార్యక్రమంలో నడుం బిగించి విజయవాడలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు వరలక్ష్మి కల్పనా శ్రీదేవి సారిక అనసూయ అమ్ములు మంజుల మరియమ్మ రాణి మీనా ఉమాదేవి సుబ్బలక్ష్మి ముకుందా అనసూయ తదితరులు పాల్గొన్నారు.

About Author