స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: ఏఐటీయూసీ
1 min readఆస్పరి: అంగన్వాడీ కేంద్రంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షురాలు సరోజమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాలూకా నాయకురాలు విశాలాక్షి గారు మండల కార్యదర్శి ప్రమీలమ్మ గారు హాజరై మాట్లాడుతూ స్కీం వర్కర్లు శాశ్వతమైన పని పద్ధతిలో నిత్యం పనుల్లో ఉన్నారని, వీరిని రెగ్యులరైజ్ చేయాలని,వీరికి వేతనాలు డీఏ అలవెన్సులు ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడి సెంటర్స్ కు ప్రభుత్వం అద్దె, కూరగాయలు గ్యాస్ బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేయడం లేదని దీని వలన వారికి వచ్చే జీతం నుంచే ఖర్చు చేయాల్సి వస్తుందని దీనివలన జీతం ఏమీ మిగలడం లేదని వచ్చిన జీతం వచ్చినట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకిరి చేయించుకుంటుద ని సమాన పనికి సమాన వేతనం 26 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని అంగన్వాడి సెంటర్స్ లో అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం మెనూ ప్రకటించింది కానీ దానికి అనుగుణంగా నిధులు ఇవ్వడం లేదని వ ఏ ట ఐసిడిఎస్ పథకానికి నిధులు మంజూరు చేయకుండా తూట్లు పొడుస్తోందని దీనివలన అంగన్వాడి సెంటర్స్ లో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కావున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్లపై ఈ నెల 28,29 లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని అని ఈ సమ్మెలో స్కీం వర్కర్లలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు చిట్టెమ్మ, ఛాయాదేవి, లక్ష్మీ ఎలిజిబెత్ రాణి, ఎంకమ్మ భాగ్యలక్ష్మి,ఉమాదేవి, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.