ఘనంగా పాఠశాల వార్షికోత్సవం…
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : మండల పరిషత్ ప్రాథమికోన్నత కన్నడ పాఠశాల,చిన్నహ్యట గ్రామం లో పాఠశాల వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు శ్రీ సత్యనారాయణ మరియు చిన్నహ్యట గ్రామ సర్పంచ్ శ్రీ ఎం. హేసానుల్లా అలాగే ఎంపీటీసీ సభ్యులు శ్రీ శివన్న,పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్ పర్సన్ శ్రీ కె. నీలకంఠప్ప మరియు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి సి.వరలక్ష్మి అలాగే ఎస్.ఎం.సి సభ్యులు, పూర్వ విద్యార్థి కే.బసవరాజు గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యి, విద్యార్థుల యొక్క సాంస్కృతిక, నృత్య, నాటక, ఏకపాత్రాభినయం, వివిధ కార్యక్రమాలను చాలా ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో జరుపుకున్నాము.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మండల విద్యాశాఖ అధికారులు వారు విద్యార్థుల ఉద్దేశించి మంచి నైపుణ్యాలు, విద్యాభ్యాసం, చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి దొడ్డ బసప్ప ఉపాధ్యాయులు జి గుర బసవరాజు, బి టి ఖలందర్, ఉపాధ్యాయుని శ్రీమతి జి రాజేశ్వరి, అతిథులుగా ఉపాధ్యాయులు ఏ కే మారెప్ప, పోతరాజు, శరణప్ప, మూస, చిన్న పుల్లయ్య, శేఖరప్ప, ధనుంజయ ఎమ్మార్సీ సిబ్బంది తుకారం, పాఠశాల ఆయా, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.