ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
1 min read
కందులూరు , న్యూస్ నేడు : గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించారు వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు. ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి ఎం.చెంచు పున్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించి విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడ బోధిస్తారని ప్రైవేటు బడులను కాకుండా ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని మీ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్చండి అని పిలుపునిచ్చారు. గ్రామ పెద్ద, విద్యాదాత అయిన శ్రీ ఉప్పలపాటి రామరాజు మాట్లాడుతూ పాఠశాల ఒక దేవాలయం అని అందులో విద్యను అభ్యసించే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించాలని మంచి ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఉన్నారని వారి ప్రోత్సాహంతో విద్యార్థులు చదువులో రాణించాలని తెలిపారు. మరో ముఖ్యఅతిథి దామచర్ల బసవయ్య మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించడం పట్ల మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులైన ఆర్. దాసయ్య పాఠశాలకు బీరువాను బహుకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి పి.ఈశ్వరమ్మ, గ్రామ పెద్దలు మన్నం వెంకయ్య క్లస్టర్ చైర్మన్ నరసరాజు, ఎస్ఎంసి చైర్మన్ కె .రజిని పాఠశాల సిబ్బంది యన్ .రాధికారాణి, వెంకటేశ్వర్లు, గంగాధర్ రెడ్డి ,నరేంద్ర ,వెంకట్రావు, ప్రసాదు, భవాని శంకర్, సుభాషిని, వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు అధికారులకు పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు . విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విజేతలకు బహుమతి అందచేశారు.
