NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి…

1 min read

గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పై (జీ.ఈ.ఆర్) భారీ ర్యాలీ

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోట విద్యార్థులు “గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో”కు సంబంధించి బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా “బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి”  “పిల్లలు బడికి పెద్దలు పనికి”  “పనికిఎందుకు తొందర చదువుకో ముందర”  “ప్రభుత్వ బడి చదువుల గుడి” వంటి  నినాదాలతో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీం భాష  మాట్లాడుతూ 5 సంవత్సరముల పైబడిన 18 సంవత్సరముల లోపు బడి ఈడు పిల్లలు ఖచ్చితముగా పాఠశాలలో విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి స్పెషల్ డ్రైవ్ లను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బడి మానుకున్న ఎంతోమంది పిల్లలు తిరిగి బడిబాట పట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మద్దిలేటి ఆచారి, పాఠశాల ఉపాధ్యాయులు శారదమ్మ, అరుణ విజయభారతి, లలితమ్మ, సరోజినీ దేవి, శంషాద్ బేగం, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, మల్లికార్జున రెడ్డి, నాగశేషులు, రామిరెడ్డి, యోగ ఇన్స్ట్రక్టర్  సుంకన్న, బోధనేతర సిబ్బంది మురళీకృష్ణ, పాములేటమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author