విద్యర్థులకు పాఠశాల స్థాయి చెకుముకి పరీక్ష
1 min readపల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుకరవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయి చెకుముకి పరీక్ష నిర్వహించారు.ఇందులో భాగంగా జడ్పీహెచ్ఎస్ గోనెగండ్ల పాఠశాలలో విద్యర్థులకు చెకుముకి పరీక్ష ప్రధానోపాధ్యాయులు నాగభూషణం అధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షలో సుమారుగా 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానో పాధ్యాయులు నాగభూషణం మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే సైన్స్ మీద మక్కువ పెంచుకోవాలని,అందుకోసం ఇలాంటి పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మన పాఠశాలలో 400 మంది విద్యార్థులు సైన్స్ మీద మక్కువతో చెకుముకి పరీక్షను రాయటం ఆనందదాయకమని అన్నారు.ఈ సందర్భంగా సైన్స్ సీనియర్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు విశ్వాసాలు మీదనే ఎక్కువగా ప్రజలు నమ్మకాలు ఉన్నాయని, ఈ మూఢనమ్మకాలు విశ్వాసాలు పోవాలంటే విద్యార్థి స్థాయి నుంచే సైన్స్ మీద అవగాహన మక్కువ పెంచుకోవాలని కోరారు.సైన్స్ అనేది నిరూపితమైనటువంటి శాస్త్రం అని అన్నారు. ఉపాధ్యాయుడు గుమ్మల బాబు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక సమాజంలో ఉన్నటువంటి నమ్మకాల మీద విశ్వాసాల మీద మూఢనమ్మకాలు మీద ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంలో ముందు వరుసలో ఉంది అని తెలిపారు. సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మార్పు కోసం విద్యార్థి దశ నుంచే సైన్స్ మీద అవగాహన కల్పించడం వారు భవిష్యత్తులో వాటిని అమలు చేసుకోనెలా జన విజ్ఞాన వేదిక ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ప్రత్యక్షంగా కూడా గాజు పెంకులపై నడవడం కాలుతున్నటువంటి నూనెలో నుంచి బజ్జీలు తీయడం మేకులు గుచ్చుకోవడం లింగాలు నోట్లో నుంచి తీయడం ఇలాంటి ఎన్నో ప్రత్యక్షంగా ప్రయోగాలు చేసి చూపించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది అందుకే జనవిజ్ఞాన వేదిక చేయు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు అమనుల్లా బేగ్, విజయ్ కుమార్, నాగేందర్ రెడ్డి ,మురళీకృష్ణ, మల్లేశ్వరమ్మ, రామచంద్రరావు, చిరంజీవి, రవి కుమార్, ప్రమీల భాయ్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.