దశలవారీగా పాఠశాలలు తెరవాలి : ఎయిమ్స్ డైరెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలోని పాఠశాలలు దశల వారీగా తెరవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. పాఠశాలలు దశలవారీగా తెరిచే అంశాన్ని దేశం పరిశీలించాలని కోరారు. కరోన కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో పాఠశాలలు కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్ లో పాఠశాలలు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వైరస్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దశలవారీగా పాఠశాలలు తెరిచేందుకు తాను ప్రతిపాదిస్తానని తెలిపారు. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇది అమలు చేయాలని సూచించారు. ఒక వేళ వైరస్ సోకడం పెరిగితే పాఠశాలలు మూసి వేయాలని కోరారు. మొబైల్, ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమవుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.