పెదపాడు శాఖ గ్రంధాలయంలో విజ్ఞాన శిబిరం..
1 min read– విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాలపై పాఠ్యాంశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెదపాడు శాఖా గ్రంథాలయంలో దసరా సెలవుల్లో భాగంగా దసరా విజ్ఞాన శిబిరం బుధవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమయ్యాయి. విద్యార్థిని విద్యార్థులచే విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా నీతి కథలు చెప్పించడం,చదివించడం, పుస్తక పఠనం చేయించడం జరిగినది మరియు రిసోర్స్ పర్సన్ కొట్నాని తరుణ్ విద్యార్థిని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం,ఇంగ్లీషులోని తేలికపాటి పదాలు తెలియపరచడంతో పాటు పాఠ్యాంశం చేస్తూ నోట్ చేయించడం జరిగినది. విరామ సమయంలో విద్యార్థినీ విద్యార్థులకు స్నాక్స్ అందిం చారు.ఈ కార్యక్రమం గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షించారు.