PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ చైతన్యలో సైన్స్​ ఎక్స్పో వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని  బుధవారపేట శ్రీచైతన్య పాఠశాల లో సైన్స్ ఎక్స్పో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం పాఠశాల ప్రిన్సిపాల్ మౌనిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి శ్రీచైతన్య విద్యాసంస్థల ఏ జి ఏం సురేష్ ,పాఠశాలల కోఆర్డినేటర్ శివకుమార్ ,శ్రీ చైతన్య పాఠశాల ప్రాంతీయ బాద్యులు వి .వెంకటేష్,ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్  ఎల్లన్న  ముఖ్య అతిథులుగా హాజరైనారు .ఈ సందర్బంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏ జి ఏం  సురేష్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్పో వల్ల విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు.పాఠశాల ప్రాంతీయ బాద్యులు వి .వెంకటేష్ మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్పో వల్ల విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర రంగంలో సాంకేతిక ప్రగతికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు.

శ్రీచైతన్య పాఠశాల కోఆర్డినేటర్ శివకుమార్ ,పాఠశాల ప్రిన్సిపాల్ మౌనిక ,ప్రభుత్వ (టౌన్ )కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ ఎల్లన్న ప్రసంగించారు .అనంతరం విద్యార్థులు రూపొందించిన అనేక ప్రయోగాలు ప్రదర్శించి వాటి గురించి చక్కగా వివరించారు ,ఈ ప్రయోగాలు అందరిని ఆకట్టుకున్నాయి.విద్యార్థులచే రూపొందించిన ప్రయోగాలలో కొన్నిటికీ బహుమతులు బహుకరించారు .ఈ కార్యక్రమం లో డీన్ వీరయ్య ఆచారి ,ప్రైమరీ ఇంచార్జి  సుచరిత , ఉపాధ్యాయులు ,విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు .

About Author