చీడపీడలపై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల డాక్టర్ సరళ, డాక్టర్ పుల్లి బాయి, డాక్టర్ లక్ష్మీ కళ్యాణి, గురువారం మండలం పరిధిలోని గడిగరేవుల, గడివేముల , బుజనూరు, చిందుకురు, తిరుపాడు, గని, ఎల్ కే తండా, పరిసర ప్రాంతాల్లో రైతులు సాగుచేస్తున్న పత్తి , వరి, మొక్కజొన్న, మిరప మరియు పండ్ల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు సూచనలు ఇస్తూ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించారు. ప్రతి మొక్కకు 45 రోజులు వయస్సు ఉన్నప్పుడు నుండి లింగాకర్షణ బుట్టలు ఎకరాకు నాలుగు నుండి 10 వరకు పెట్టుకోవాలని పురుగు ఉదృతిని గమనిస్తూ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రోపినాఫిన్ రెండు మిల్లీ లీటర్లు పిచికారి చేసుకోవాలన్నారు. బాగా పంట చివరి దశలో ఉన్నట్లయితే లాండ్సెహైత్రిన్ మందును రెండు మిల్లీ లీటర్లు పిచికారి చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణకు విషపు అరను అమర్చి 20 రోజులమొక్క గడిలో వేసినట్లయితే పంట చివరి వరకు కత్తెర పురుగు ను నివారించవచ్చు వైరస్ తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే పంటను తీసివేయవలసిందిగా సూచించారు . మిరపలో వేరు తెగులు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సందేహాలు ఉన్నట్లయితే రైతు సంబంధిత అధికారులను ఆర్ బి కే సంప్రదించి వారి సూచనల మేరకు పంట సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.