రైతుల పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మిడుతూరు గ్రామంలో మిరప పంట యందు వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రప్రదర్శన నిర్వహించారు.ఈకార్యక్రమానికి వైద్యులు ఎ.రామకృష్ణ రావ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (సస్యరక్షణ)కో ఆర్డినేటర్ మరియు వారి బృందం,వ్యవసాయ సహాయ సంచాలకులు సి.విజయశేకర్ మరియు మండల వ్యవసాయాధికారి ఎం.పీరునాయక్ మిరప పంట యందు జిగురు అట్టలు నీలి,పసుపు,తెలుపు అట్టలు ఎకరానికి 10-15 పెట్టుకోవడం వలన పచ్చ దోమ,నల్ల దోమను అరికట్టవచ్చును అని అదేవిధంగా దానితోపాటు పత్తిలో ఫిరామోన్ ట్రాప్స్ ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేసుకోవడం వలన పత్తిలో గులాబీ రంగు పురుగు మరియు టోభాకో వైరస్ లను నివరించుకోవచ్చు అని తెలియచేసారు కావున రైతులందరు ఈరకమైన సస్యరక్షణ చర్యలు చేసుకోవడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించారు.తర్వాత మిడుతూరులో మైక్రో కంపెనీ వారు ఇచ్చినటువంటి ఎంఆర్సి 7160 రకం పత్తి పంటను వ్యవసాయ సహాయ సంచాలకులు పరిశీలించారు.ఈపంటలో పూత మొగ్గ రాలిపోయి మొక్క పెరుగుదల ఆగిపోవడం వంటి లక్షణాలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ మరియు రైతులు పాల్గొన్నారు.