PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్లమెంటు సభ్యులను బహిష్కరణ ను ఖండించిన S D P I

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కట్టుదిట్టమైన భద్రతలో జరిగే పార్లమెంటు సమావేశాలు అపహస్యం పాలు జరిగే విధంగా పార్లమెంటులో జొరబడి గందరగోళం సృష్టించడం జరిగింది భద్రతా లోపాలను ప్రశ్నించిన పార్లమెంటు సభ్యులను సమావేశాల నుండి బహిష్కరించడం చాలా దారుణం. ఇందుకు ఎందుకు ప్రత్యక్షంగా పరోక్షంగానూ కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సింది పోయి దీనిని ప్రశ్నించిన పార్లమెంటు సభ్యులను బహిష్కరించడం బిజెపి నియంతృత్వ వైఖరిని అవలంబిస్తుంది . పార్లమెంటు భద్రతా  వైఫల్యాలను బాధ్యత వహిస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందుకు విరుద్ధంగా 140 కు పైగా పార్లమెంటు సభ్యులను బహిష్కరించడం చాలా దారుణమని  ఆలూరు అసెంబ్లీ కార్యదర్శిs.రహిమాన్ మరియు k అబ్దుల్ రెహమాన్ smd. షఫీ k. భాష m.భక్షి  ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు.

About Author