నీటి సమస్య పరిష్కరించిన ఎస్డీపిఐ… ప్రజలు హర్షం వ్యక్తం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: గత కొన్ని రోజుల క్రితం 6 వార్డ్ సినిమా రోడ్డు లైన్ రాబోయే ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలని మరియు హ్యాండ్ పంప్ రిపేరీ ఉండటం వలన ఎస్డిపిఐ బ్రాంచ్ కమిటీ తరపున పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ మరియు సెక్రెటరీ స్పందించి హ్యాండ్ పంప్ తీసి సమ్మర్సబుల్ మోటర్ బిగించడం జరిగింది. ప్రజలకు రాబోయే ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూసుకోవడం కోసం మోటర్ మరియు స్టార్టర్ బిగించడం జరిగింది. ఈ సమస్య పరిష్కారమైనందువలన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.