వెతికి వెతికి మరీ అరెస్టు .. అరెస్టులు కాదు ఉద్యోగాలు ఇవ్వండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ముందస్తు అరెస్టులు అరెస్టులతో పోరాటాలు ఆపలేరని, ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఏఐవైఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వి గంగా సురేష్ అన్నారు. విజయవాడలో తలపెట్టిన నిరుద్యోగుల ధర్నా కు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో వెతికి వెతికి మరీ ముందస్తు అరెస్టులు చేశారని అన్నారు. నేను విన్నాను నేను ఉన్నాను.. ఒక్క అవకాశం ఇవ్వండి అని సీఎం జగన్ చెప్పారని, గెలిచాక ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన జగనన్న ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని వాపోయారు.