PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌టి క‌రాటే క‌ళ్యాణి ఇంట్లో సోదాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినీ న‌టి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్‌ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే.

                                             

About Author