PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెబ్​ తనిఖీలో.. బంగారు బిస్కెట్లు పట్టివేత

1 min read

– రూ.6 కోట్ల 86 లక్షలు విలువ చేసే 14.8 కేజీల బంగారం స్వాధీనం
– వెల్లడించిన డీఎస్పీ కె.వి మహేష్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు క్రైం: అంతరాష్ట్ర సరిహద్దు.. పంచలింగాల చెక్​ పోస్టు వద్ద సెబ్​, లోకల్​ పోలీసుల తనిఖీలో శుక్రవారం రూ.6 కోట్ల 86 లక్షలు విలువ చేసే 148 బంగారు బిస్కెట్లు పట్టుబడినట్లు కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్​ తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తాళ్ళ ప్రొద్దూటూరు గ్రామం, రైల్వే కోండాపురం, కడప జిల్లాకు చెందిన రాతి మిద్దె రాజా (40 ) అనే వ్యక్తి తాడిపత్రి కి చెందిన అంబటి పుల్లారెడ్డి జ్యూవెలర్స్ మెయిన్ బజార్ లో పనిచేస్తున్నాడు. రాతి మిద్దె రాజా ఈ నెల 24న హైదరాబాద్​కు వెళ్లి.. అబిడ్స్​లోని మనో కామన గోల్డ్ షాపు నుండి ఒక్కొక్కటి 100 గ్రా. బరువు కలిగిన 163 బంగారు బిస్కెట్లను కొనుగోలు చేశారు. అందులో 15 బంగారు బిస్కెట్లను హైదరాబాద్ లోని వేరే వేరే ప్రాంతాలలో విక్రయించాడు. మిగిలిన 148 బంగారు బిస్కెట్లను తీసుకుని హెదరాబాద్ నుండి కర్నూలు వైపు ఆర్టీసి బస్సులో వస్తుండగా శనివారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో పంచలింగాల చెక్ పోస్టు వద్ద గల సెబ్ మరియు లోకల్ పోలీసులు చేసిన తనిఖీ పట్టుబడ్డాడు. రాతి మిద్దె రాజా నుండి సరైన బిల్లులు, ఈవే బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో… పోలీసు ప్రోసిడింగ్స్ ద్వారా సదరు వ్యక్తి నుంచి 148 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాతి మిద్దె రాజాపై టూటౌన్​ పోలీసులు క్రైమ్ నెంబర్ 245 / 2021 U/ Sec 102 CRPC క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లను సంబంధిత శాఖలైన ఆదాయ పన్ను శాఖ, స్టేట్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ అధికారులకు తెలియపరచి సరైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రెస్ మీట్ లో కర్నూల్ తాలుక సీఐ విక్రమ్ సింహా , సెబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య ఉన్నారు.

About Author